నవతెలంగాణ హైదరాబాద్: కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎస్‌ను ఆదేశించారు. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించడం పట్ల ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రయాణికుల భద్రతే ప్రాధాన్యతగా బస్సుల యాజమాన్యం వ్యవహరించాలని సూచించారు.
కోదాడ రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



