- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నేపాల్‌ను మెరుపు వరదలు వణికించాయి. బుధవారం ఉదయం ఉత్తర నేపాల్‌లో వరదలు సంభవించగా.. సరిహద్దుల్లోని పలు గ్రామాలు కొట్టుకుపోయినట్లు తెలుస్తుంది. ఇళ్లు, బ్రిడ్జ్‌లు, ప్రాజెక్టులు, మార్కెట్ ప్రాంతానికి తీవ్రనష్టం వాటిల్లింది. వాహనాలు కొట్టుకుపోయాయి. టిబెట్ వైపునున్న భోటెకోశీ నది ఈరోజు ఉదయం ఉద్ధృతంగా ప్రవహించింది. నదిలో నీటి ప్రవాహం పెరగడంతో రసువా జిల్లాలోని పలు గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయి ఉండొచ్చని అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి.
- Advertisement -



