Wednesday, August 26, 2026
E-PAPER
Homeఆటలుఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మిచెల్ స్టార్క్ అగ్రస్థానం..

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మిచెల్ స్టార్క్ అగ్రస్థానం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : టెస్టు క్రికెట్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను వెనక్కి నెట్టి ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ తొలిసారిగా ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 2024 ఫిబ్రవరిలో తొలిసారి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న బుమ్రా.. దాదాపు రెండేళ్లుగా పాటు అదే స్థానంలో కొనసాగాడు. శ్రీలంకతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ సిరీస్‌కు బుమ్రా గాయం కారణంగా దూరం కావడతో స్టార్క్‌కు నంబర్ వన్ ర్యాంక్ వచ్చింది. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో స్టార్క్ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. దీంతో బుమ్రా(862), న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ మ్యాట్ హెన్రీ(861)లను వెనక్కి నెట్టి 872 పాయింట్లతో మొదటిసారి స్టార్క్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

బ్యాటింగ్ విభాగంలో టాప్ స్థానాల్లో పెద్దగా మార్పులు లేవు. ఇంగ్లండ్ స్టార్ హ్యారీ బ్రూక్ నంబర్-1 స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ మాత్రం భారీగా దూసుకొచ్చాడు. శ్రీలంకతో గాలేలో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకంతో మెరిసిన పంత్ ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి 711 పాయింట్లతో శుభ్‌మన్ గిల్‌తో కలిసి సంయుక్తంగా ఏడో ర్యాంక్‌కు చేరాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో ఎలాంటి మార్పులు లేవు. రవీంద్ర జడేజా(428) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -