నవతెలంగాణ–హైదరాబాద్: హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి పెండింగ్ చలాన్లు చెల్లించని వాహనదారులకు షాక్ ఇచ్చేలా ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. వాహనాలపై ఉన్న పెండింగ్ ఈ-చలాన్ల మొత్తాన్ని సంబంధిత వాహనం ఫాస్టాగ్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా మినహాయించే విధానాన్ని అమలు చేసే అంశంపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వార్షికోత్సవ కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఈ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఫాస్టాగ్ ద్వారా చలాన్ల వసూళ్లపై హెచ్‌ఎండీఏ అధికారులతో చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. అయితే ఈ విధానం అమలుపై తుది నిర్ణయం, నిబంధనలు, సాంకేతిక అనుసంధానంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఫాస్టాగ్ ప్రధానంగా కార్లు, భారీ వాహనాలకు ఉండటంతో బైక్‌లు, ఆటోలకు ఈ విధానం ఎలా వర్తిస్తుందన్నది కూడా ప్రశ్నగా మారింది. తప్పుగా విధించిన చలాన్లపై అప్పీల్ అవకాశం, జరిమానా కట్ చేసే ముందు సమాచారం వంటి అంశాలపై మార్గదర్శకాలు వెలువడాల్సి ఉంది.
ట్రాఫిక్ చలాన్లు కట్టకపోతే ఫాస్టాగ్ నుంచి డబ్బులు కట్..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



