- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు (73) అనారోగ్యంతో బుధవారం రాత్రి కన్నుమూశారు. నటి కరాటే కళ్యాణి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. 1953లో జన్మించిన నారాయణ రావు, 1976లో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అంతులేని కథ’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆయన చిరంజీవి నటించిన ‘దేవాంతకుడు’, ‘యముడికి మొగుడు’ చిత్రాలను నిర్మించారు. నటనలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో బ్యాచ్ మేట్ అయిన జీవీ, చిరంజీవికి అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు.
- Advertisement -



