- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతిచెందిన వారి సంఖ్య 469కి చేరుకున్నట్లు ఆ దేశ పోలీసులు వెల్లడించారు. వరదల వల్ల సుమారు 1500 మంది ఆచూకీ లేనట్లు కూడా తెలిపారు. ఇక మరో వైపు చైనా వార్నింగ్ ఇచ్చింది. మళ్లీ దిగువ ప్రాంతాలకు మరింత భీకర వరదలు సంభవించే అవకాశాలు ఉన్నట్లు డ్రాగన్ దేశం హెచ్చరించింది. తాజా వరదల్లో సుమారు 178 మంది భారతీయులు గల్లంతు అయినట్లు నేపాల్ అధికారులు చెబుతున్నారు. 11 మందిని రెస్క్యూ చేశారు. విదేశీ పర్యాటకులతో పాటు మానస సరోవర యాత్రకు వెళ్లిన యాత్రికులు ఎక్కువ సంఖ్యలో మిస్ అయినట్లు తెలుస్తోంది.
- Advertisement -



