- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లోని మదాపూర్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సంతానం లేదనే కారణంతో భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. బి.సునీతా నాయక్ (32)కు ధర్మేంద్ర కుమార్‌తో 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 6 ఏళ్లుగా ఇజ్జత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. సంతానం లేదని భర్త ధర్మేంద్ర కుమార్ మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. గురువారం డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన భర్తకు భార్య విగతజీవిగా కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



