Saturday, August 29, 2026
E-PAPER
Homeజాతీయంపాట్నాలో ఉద్రిక్తత..భీమ్ ఆర్మీ భారీ ర్యాలీ

పాట్నాలో ఉద్రిక్తత..భీమ్ ఆర్మీ భారీ ర్యాలీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ రాజధాని పాట్నాలో ఉద్రిక్తత నెలకొంది. శనివారం గాంధీ మైదాన్ వద్ద ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్), భీమ్ ఆర్మీ సభ్యులు భారీ ఆందోళన చేపట్టారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) పరీక్షలో జరిగిన అవినీతిని ఖండిస్తూ రాజ్ భవన్ వైపు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అప్రమత్తమైన పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. నిరసనకారులను అడ్డుకోవడానికి బారికేడ్లను ఏర్పాటు చేసి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. BPSC చైర్మన్‌ను తక్షణమే తొలగించాలని, ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం శిక్షణ పొందుతున్న అభ్యర్థుల శిక్షణను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -