నవతెలంగాణ-హైదరాబాద్: కల్తీ ఆహార పదార్థాలను అరికటాల్సిన పుడ్ ఇన్స్పెక్టర్ చేతి వాటం ప్రదర్శించాడు. విషయం తెలిసిన స్థానికులు లంచాలకు రుచి మరిగిన ఓ ప్రభుత్వాధికారికి సరైన రీతిలో సమాధానమిచ్చారు. కాలం చెల్లిన బిస్కెట్లలను నోట్లో పెట్టి తినాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ లో చోటు చేసుకుంది.
స్థానికుల సమాచారం ప్రకారం, స్థానిక ఓ దుకాణం నుండి బిస్కెట్లు కొనుగోలు చేసి తిన్న తర్వాత రెండేళ్ల చిన్నారి అస్వస్థతకు గురై, కళ్లు తిరగడంతో ఈ వివాదం మొదలైంది. ఆ చిన్నారి పరిస్థితి విషమించడంతో, కుటుంబ సభ్యులు చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో ఆ చిన్నారి బంధువులు, ఇతర స్థానికులు ఛత్రపతి సంభాజీనగర్‌లోని ఎఫ్‌డిఎ (FDA) కార్యాలయాన్ని సంప్రదించి షాప్ ఓనర్ పై ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు షాప్ లో తనిఖీలు చేయగా గడువు ముగిసిన అనేక బిస్కెట్ల ప్యాకెట్లను దుకాణంలో అమ్ముతున్నట్లు అధికారలు గుర్తించారు. కాలం చెల్లిన ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నప్పటికీ, దుకాణదారుడిపై అధికారులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహించారు. సదురు అధికారి లంచం తీసుకొని దుకాణదారుడిని కాపాడుతున్నాడని ఆరోపిస్తూ, గడువు ముగిసిన ఆ బిస్కెట్లను అతని నోటిలో బలవంతంగా పెట్టడానికి ప్రయత్నించారు.



