Friday, September 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసర్‌పై అభ్యంతరాలు.. గడువు పొడిగించాలని సీఈసీకి సీఎం లేఖ

సర్‌పై అభ్యంతరాలు.. గడువు పొడిగించాలని సీఈసీకి సీఎం లేఖ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఓటర్‌ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై అభ్యంతరాలు, క్లెయిమ్‌ల గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌కు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. అక్టోబర్‌ 19తో గడువు ముగుస్తున్న నేపథ్యంలో, సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేనందున గడువు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్ల పరిశీలనలో లోపాలు ఉన్నాయని, ఇళ్లు మారిన వారి ఓట్లను నోటీసు లేకుండా తొలగించవద్దని కోరారు. గ్రామ, వార్డు సభల్లో ముసాయిదా ఓటర్‌ జాబితాను రెండుసార్లు చదివి వినిపించాలని, నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో అదనపు ఈఆర్‌వోలను నియమించాలని సీఎం కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -