Saturday, August 29, 2026
E-PAPER
Homeజాతీయంమమతా బెనర్జీపై కేసు ఫైల్

మమతా బెనర్జీపై కేసు ఫైల్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: టీఎంసీ అధ్యక్ష‍ురాలు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కోల్‌కతా పోలీసులు శనివారం సుమోటో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తృణమూల్‌ ఛత్రపరిషద్‌ (టీఎంసీపీ) నిర్వహణలో కోల్‌కతా హైకోర్టు విధించిన షరతులను ఆమె ఉల్లంఘించారని పేర్కొన్నారు. మమతా బెనర్జీతో పాటు టీఎంసీపీ సమావేశం నిర్వాహకులపై కూడా హాస్టింగ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని, విచారణ చేపట్టనున్నామని అన్నారు. శుక్రవారం సెంట్రల్‌ కోల్‌కతాలోని క్యాథడ్రల్‌ రోడ్‌లో తృణమూల్‌ విద్యార్థి విభాగం (టీఎంసీపీ) వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -