Saturday, August 29, 2026
E-PAPER
Homeజాతీయంబాలుడి సమయస్ఫూర్తి..కాపాడిన బలగాలు..వీడియో

బాలుడి సమయస్ఫూర్తి..కాపాడిన బలగాలు..వీడియో

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్ దేశంలో ఆకస్మిక వరదలు పెను విధ్వంసాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. భోటేకోసి, త్రిశూలి నదులకు పోటెత్తిన భారీ వరదలు..నదీ పరివాహక ప్రాంతాల్లో అల్లకల్లోలం చేశాయి. వరదల ధాటికి అనేక భవంతులు, రోడ్లు, వంతెనులు, మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బురదతో కూడిన వరద నీరు గ్రామాలను నిండాముంచింది. ప్రజల సాధారణ జీవనం స్తంభించిపోయింది. వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత ముప్పు ప్రభావిత ప్రాంతాల్లో ఆ దేశ ఆర్మీ బలగాలు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈక్రమంలో ఆర్మీ హెలికాప్టర్ రాకను గమనించిన ఓ బాలుడు తన ఒంటిపై టీ షెర్ట్ తో గాల్లో ఊపుతూ సంకేతం అందించాడు. గమనించిన పైలట్ ఆ బాలుడు ఉన్న ఇంటి వైపు హెలికాప్టర్ ను మళ్లీంచాడు. ఆ తర్వాత సురక్షితంగా బాలుడిని కాపాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -