- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండల పరిధిలోని బస్వాపూర్ కేజీబీవీ పాఠశాల గ్రౌండ్లో ఇంకుడు గుంత నిర్మాణం పనులను గ్రామ సర్పంచ్ వాగ్మారే రమణ సురేష్ గొండ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..కేజీబీవీ పాఠశాల గ్రౌండ్లో ఉపాధి హామీ నిధుల కింద ఇంకుడు గుంత నిర్మాణం చేయాలని బస్వాపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మాణించిందని చెప్పారు. ఇందులో భాగంగా నేడు (శనివారం) ఉపాధి హామీ కూలీలతో పనులు ప్రారంభించామని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనిల్ కుమార్, వార్డ్ సభ్యులు నాగనాథ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



