Saturday, August 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహమ్మదాబాద్ లో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు

మహమ్మదాబాద్ లో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని మహమ్మదాబాద్ ఎంపియూపిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాంబ్లే గోపాల్‌ విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్ తదితర క్రీడల్లో పాల్గొని, తమ ప్రతిభను కనబరిచారు. గెలుపు-ఓటములను సమానంగా స్వీకరిస్తూ, క్రమశిక్షణతో ఆటల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో ఐక్యత, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, ఆరోగ్యవంతమైన జీవితానికి క్రీడలు ఎంతో అవసరమని చెప్పారు. ఆరోగ్యానికి క్రీడలు – విజయానికి క్రమశిక్షణ అనీ, విద్యార్థులందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయ బృందం జ్ఞానేశ్వర్, సాయిలు, శ్రీనివాస్, నరసింహ, సంతోష్, రఘు, ప్రియా, దీపికలను పలువురు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -