నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం మండలం మేడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేపట్టిన పనులకు సంబంధించి గ్రామసభలో చర్చించకుండా, వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండా విడిసిలో తీర్మానాలు చేసినట్లు ఆరోపిస్తూ భూపాలపల్లి జిల్లా పంచాయతీ అధికారి (డిపిఓ)కు మాజీ సర్పంచ్ చింతల సుధాకర్, గ్రామస్థుడు అప్పాల భూమేష్ యాదవ్ శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామంలో గణనీయ సంఖ్యలో గిరిజన ప్రజలు ఉన్నప్పటికీ, ఈ విషయం గ్రామసభలో తెలియజేసి ఉంటే అర్హులైన గిరిజన ప్రజలు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవారని పేర్కొన్నారు. మేడిపల్లి గ్రామానికి సంబంధం లేని పెద్ది మహేందర్‌ను విడిసి అధ్యక్షుడిగా ఏ నిబంధనల ప్రకారం నియమించారో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. అలాగే సంబంధిత పత్రాల్లో సర్పంచ్ భర్తకు సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామపంచాయతీ సిబ్బంది పేర్లు ఉండటంపై విచారణ చేయాలని కోరారు. విడిసి సభ్యుల సంతకాలపై ఉన్న అనుమానాలను అసలు రికార్డుల ఆధారంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. సంబంధిత తీర్మానాలు చట్టబద్ధంగా జరిగాయా.? లేక వ్యక్తిగత ప్రయోజనాలకు అనుకూలంగా జరిగాయా.? అనే అంశంపై నిష్పక్షపాత విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి గిరిజన ప్రజలకు న్యాయం చేయాలని డిపిఓను కోరారు.
వీడీసీ తీర్మానాలపై డీపీఓకు ఫిర్యాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



