Saturday, August 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాదాపూర్-సలాబత్పూర్ హనుమాన్ ఆలయానికి పాదయాత్ర

మాదాపూర్-సలాబత్పూర్ హనుమాన్ ఆలయానికి పాదయాత్ర

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
శ్రావణమాసంలో మాదాపూర్‌ గ్రామ వార్కారీలు నెల రోజుల పాటు మూడు పూటలా నిత్యం పూజలు, భజనలు, అన్నదానాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా శనివారం వార్కారి సాంప్రదాయం పాటించేవారు పెద్ద ఎత్తున మహిళలు, పురుషులు, వారి గ్రామం నుంచి మద్నూర్‌ మండలంలోని సలాబత్పూర్‌ హనుమాన్‌ ఆలయం వరకు దాదాపుగా 25 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో దారి పొడువునా ఉన్న గ్రామస్తులు వారికి సన్మానాలు చేశారు. అనంతరం సలాబత్పూర్ హనుమాన్ ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి సర్పంచ్‌ ఆశా రామచందర్‌ పటేల్, ఉప సర్పంచ్‌, జీపీ కార్యవర్గ సభ్యులు ఆలయ ప్రాంగణంలోకి సాదరంగా ఆహ్వానించి, ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు రాజు పటేల్, మాజీ సర్పంచ్ దినేష్, గ్రామస్తులు, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -