Saturday, August 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గోపాలమిత్రలకు కృత్రిమ గర్భధారణ పరికరాల పంపిణీ

గోపాలమిత్రలకు కృత్రిమ గర్భధారణ పరికరాల పంపిణీ

- Advertisement -

జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ భరత్ కుమార్ చేతుల మీదుగా అందజేత
నవతెలంగాణ – భిక్కనూర్
గోపాలమిత్రులకు కృత్రిమ గర్భధారణకు వినియోగించే థాయింగ్ పరికరాలను జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ భరత్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. పశుపోషకులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పశువైద్యాధికారి మాట్లాడుతూ గోపాలమిత్రులు గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషకులకు అందుబాటులో ఉంటూ కృత్రిమ గర్భధారణ సేవలను సమర్థవంతంగా అందించాలని సూచించారు. పశువుల ఆరోగ్య సంరక్షణతో పాటు పాడి రైతుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ దేవేందర్, డాక్టర్ మౌనికా రెడ్డి, జిల్లా డీఎల్‌డీఏ సూపర్‌వైజర్ కృష్ణ, కామారెడ్డి జిల్లా గోపాలమిత్ర అధ్యక్షులు బాలయ్య, గోపాలమిత్రులు బ్రహ్మం, మహిపాల్ రెడ్డి, మురళి, సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -