- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో గల ఆంజనేయ స్వామి ఆలయంలో పునప్రాణ ప్రతిష్ట, శివలింగం, నంది, ధ్వజస్తంభం, శిఖర స్థాపనకు నిర్వాహకులు ఆలయాన్ని అన్ని అంగుళాలతో తీర్చిదిద్దారు. ఇందులో భాగంగా ఈనెల 30న ధ్వజస్తంభన, శిఖర స్థాపన శివాచార్య స్వామి మహారాజ్ ఖర్గావ్ కర్ సంయుక్తంగా ప్రత్యేక పూజలకు సేవా సమితి అన్ని ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం ఒంటిగంట నుండి ఆలయ ఆవరణంలో మహా అన్న ప్రసాదం చేపడుతున్నట్లు సేవా సమితి సభ్యులు తెలిపారు. కార్యక్రమానికి గ్రామ పెద్దలు, గ్రామస్తులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సేవా సమితి నాయకులు కోరారు.
- Advertisement -


