– జెడ్పీహెచ్ఎస్ ఆలేరు విద్యార్థుల క్రీడా ప్రతిభ
– ఎస్ జి ఎఫ్ నెల్లికుదురు జోనల్ సెక్రెటరీ దామల్ల విజయ్ చందర్
నవతెలంగాణ-నెల్లికుదురు : నెల్లికుదురు జోనల్ స్థాయి ఆటల పోటీలలో మహబూబాబాద్ జిల్లా స్థాయికి ఎంపికైన నెల్లికుదురు మండల క్రీడాకారులను అభినందించినట్లు ఎస్ జి ఎఫ్ జోనల్ సెక్రటరీ దామల విజయ చందర్ తెలిపారు . శుక్రవారం కేసముద్రం మండలంలోని పెనుగొండ గ్రామంలో జోనోస్థాయి క్రీడల్లో జిల్లా స్థాయికి ప్రతిభ కనబరిచిన నెల్లికుదురు మండల క్రీడాకారులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కబడ్డీ బాలుర విభాగం – ప్రథమ స్థానం , కబడ్డీ బాలికల విభాగం – ద్వితీయ స్థానం, కోకో బాలుర విభాగం – ద్వితీయ స్థానం, వాలీబాల్ బాలుర విభాగం – ప్రథమ స్థానం,ఈ నాలుగు విభాగాల్లో నెల్లికుదురు మండలం విజయం సాధించడంలో జెడ్పీహెచ్ఎస్ ఆలేరు విద్యార్థులు కీలక పాత్ర పోషించడం పాఠశాలకు ఎంతో గర్వకారణం అని అన్నారు. ఈ సందర్భంగా నెల్లికుదురు మండల క్రీడాకారులు జిల్లా స్థాయిలో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ క్రీడాకారులను అభినందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఈటి ఇమామ్ తో పాటు కొంతమంది ఉన్నారు.
జోనల్ స్థాయి క్రీడల్లో జిల్లా స్థాయికి ఎంపికైన మండల క్రీడాకారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


