Friday, September 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి: డా.మీర్జా 

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి: డా.మీర్జా 

- Advertisement -

నవతెలంగాణ-మిడ్జిల్ 
ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, గ్రామాలలో మురుగునీరు నిలవకుండా చూడాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మీర్జా చెప్పారు. మండలంలోని వేముల గ్రామంలో మెడికల్‌ క్యాంపు నిర్వహించారు. ఈ మేరకు 160 మందికి  వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. దగ్గు, జ్వరం, సర్ది , కాళ్లు నొప్పులు, షుగర్, బిపి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. 37 మందికి టిబి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. టిబి వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.1000 చొప్పున ఆరు నెలలు అందజేస్తున్నట్లు డాక్టర్ మీర్జా పేర్కొన్నారు. పౌష్టిక ఆహారం తీసుకుంటే  టిబి దరిచేరదని  వైద్యులు సూచనలు ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగమ్మ, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఆయుబ్ ఖాన్, జిల్లా టిబి సూపర్వైజర్ యాసిన్, హెల్త్ అసిస్టెంట్లు దేవయ్య, జంగయ్య, ఏఎన్ఎం శంకరమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ మోహన్ రాజ్, వేముల గ్రామ పెద్దలు పాండు ఆంజనేయులు, లింగం గౌడ్ ,రాజు, గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్ నాయక్ ఆశా కార్యకర్తలు లక్ష్మమ్మ ,ఎల్లమ్మ, సుగుణమ్మ, నర్మదా, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -