Friday, September 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం

- Advertisement -

ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్
నవతెలంగాణ–ఆలేరు రూరల్

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్ అన్నారు. ఆలేరు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.మండల విద్యాధికారి ఎర్ర లక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా, వారిలో క్రమశిక్షణ, విలువలు, సామాజిక బాధ్యత, నైతికతను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ఉత్తమ సేవలు అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించడం అభినందనీయమన్నారు.

మండల విద్యాధికారి ఎర్ర లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు కోసం ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు.విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడంతో పాటు పాఠశాలల్లో ఆహ్లాదకరమైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని అభినందించారు.

అనంతరం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వడ్డేపల్లి సిద్ధేశ్వర్,నరికడపు రాధిక,సాంబారి రాధిక, అనుమంతుల వెంకటయ్య, కొమ్ము సురేఖ (ప్రిన్సిపాల్),గుంటోజు కవిత,జి. లలిత, సీఆర్‌పీ మద్దెల తిరుపతి,ఎంఎస్ కోఆర్డినేటర్ బోడ చైతన్యలను ఘనంగా సన్మానించారు.అలాగే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన ఆకారపు జ్యోతిర్మయి, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఆరే సత్యవతి, బూడిద శ్రీనివాస్, తన్నీరు శ్రీనివాస్, సి.హెచ్. లక్ష్మీకుమారి, పారెడ్డి సుచరితలను శాలువాలతో సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు,మండల పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -