Friday, September 18, 2026
E-PAPER
Homeఖమ్మంవీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే కుట్రలను తిప్పికొట్టాలి

వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే కుట్రలను తిప్పికొట్టాలి

- Advertisement -

– సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు మోరంపూడి పాండురంగారావు
నవతెలంగాణ-సత్తుపల్లి 

వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే కుట్రలను తిప్పికొట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు మోరంపూడి పాండురంగారావు అన్నారు. ​సత్తుపల్లి పాత సెంటర్‌లో సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ రావుల రాజబాబు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యవక్తగా పాండురంగారావు పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులను అవమానపరిచేలా ప్రవర్తిస్తున్న బీజేపీ మతోన్మాద శక్తుల కుట్రలను ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన ఈ వీర పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ప్రజా ఉద్యమాలతో ముందుకెళ్తామని పాండురంగారావు పిలుపునిచ్చారు.

నిజాం నిరంకుశ పాలనను, రజాకార్ల దౌర్జన్యాలను ఎదుర్కొని ముచ్చెమటలు పట్టించిన గొప్ప చరిత్ర సీపీఐ(ఎం)కు ఉందన్నారు. ఈ చరిత్ర గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు. వీర తెలంగాణ సాయుధ పోరాట ఘనకీర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేయడం మనందరి బాధ్యత అని పాండురంగారావు తెలిపారు. ఈ మహోజ్వల చరిత్రను స్మరించుకుంటూ ప్రతి గ్రామంలోనూ పోరాట వారోత్సవాలను విస్తృతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, రైతు సంఘం జిల్లా నాయకులు శ్రీహరి, సైదా, కోటయ్య, బలగాని శ్రీను, చప్పిడి భాస్కర్, రాము, నల్లగట్ల వెంకటేశ్వరావు, జిలాని, రామకృష్ణ, వెంకన్న, శివ, శ్రీనివాసరావు, బడే మియా, నభి, మీరాజ్, లక్ష్మణ్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -