- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఎంబీబీఎస్ విద్యార్థిని విషం తాగి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో చోటుచేసుకుంది. మృతురాలిని కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారి కుమార్తె యశ్వితగా గుర్తించారు. ఆమె ఆరు నెలలుగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ఉంటూ నీట్ పీజీ పరీక్షకు సిద్ధమవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఒక్కగానొక్క కుమార్తె మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



