- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పలు ప్రాంతాలకు వర్ష సూచన చేసింది. వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
- Advertisement -



