- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భోటే కోషి నదిలో మరోసారి నీటి మట్టం భారీగా పెరుగుతుండటంతో నేపాల్ విపత్తు నివారణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రసువా, ధాండింగ్, నువాకోట్, చిత్వాన్ జిల్లాలను హైఅలర్ట్‌లో ఉంచింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
- Advertisement -



