Sunday, August 30, 2026
E-PAPER
Homeఆటలుహాకీ ప్రపంచకప్ విజేత అర్జెంటీనా

హాకీ ప్రపంచకప్ విజేత అర్జెంటీనా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ :మహిళల హాకీ ప్రపంచకప్‌ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. నిన్న‌ ఆమ్‌స్టెల్‌వీన్‌లో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో, షూటౌట్‌లో 3-1 తేడాతో ఆతిథ్య నెదర్లాండ్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో విజేతను నిర్ణయించేందుకు షూటౌట్‌ నిర్వహించాల్సి వచ్చింది. ఆట 30వ నిమిషంలో యిబీ జాన్సన్ గోల్ చేయడంతో నెదర్లాండ్స్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, ద్వితీయార్థంలో పుంజుకున్న అర్జెంటీనా 54వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకుంది. మారియో గ్రానాటో అద్భుతమైన గోల్‌తో స్కోరును సమం చేయడంతో మ్యాచ్ షూటౌట్‌కు దారితీసింది. షూటౌట్‌లో అర్జెంటీనా క్రీడాకారిణులు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఆ జట్టు తరఫున విక్టోరియా గ్రానాటో, బ్రిసా, సోఫియా కైరో గోల్స్ సాధించగా, నెదర్లాండ్స్ జట్టులో మారీన్ మాత్రమే లక్ష్యాన్ని చేర గలిగింది. దీంతో అర్జెంటీనా విజయం ఖాయమైంది. అర్జెంటీనాకు ఇది మూడో ప్రపంచకప్ టైటిల్ కావడం విశేషం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -