Monday, August 31, 2026
E-PAPER
Homeజాతీయంబెంగళూరులో రైలు ఢీకొని ముగ్గురు మృతి

బెంగళూరులో రైలు ఢీకొని ముగ్గురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డబళ్లాపుర రైల్వేస్టేషన్‌లో సోమవారం ఉదయం ట్రాక్‌ దాటుతున్న ఇద్దరు బాలికలు సహా ఓ మహిళను రైలు ఢీకొంది. సమాచారం అందుకున్న యలహంక రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతులు హిందూపురానికి చెందిన ఇర్ఫాన (46), రుకియా (13), రాకియా(8)గా గుర్తించారు. ఆదివారం సెలవురోజు కావడంతో వీరు దొడ్డబళ్లాపురలోని బంధువుల ఇంటికి వచ్చారు. సోమవారం తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -