నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమబెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దులోని బన్‌పూర్ గ్రామంలో ఓ అనుమానాస్పద మహిళ వద్ద అక్రమంగా దాచి ఉంచిన 15 కిలోల బంగారాన్ని అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఆ మహిళను ఆదివారం అరెస్టు చేశారు. బన్‌పూర్ గ్రామంలో ఓ మహిళ కొంతకాలంగా అనుమానాస్పదంగా సంచరిస్తుండటాన్ని జవాన్లు గమనించారు. అనంతరం ఆమెపై నిఘా పెట్టారు. ఆ మహిళ ఇంట్లో బిఎస్‌ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేయగా, 15.6 కిలోల దాచిన బంగారం బయటపడింది. ఆ బంగారాన్ని సీజ్ చేసి ఆ మహిళను అరెస్టు చేశారు. ఆ మొత్తం బంగారం విలువ రూ.24 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇంత పెద్ద మొత్తంలో బంగారం బంగ్లాదేశ్ సరిహద్దుకు ఎలా చేరింది ? దానిని ఎవరికి ఇవ్వడానికి మహిళ ప్రయత్నిస్తుందనే వివరాలు తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు చేపట్టారు.
బంగ్లాదేశ్ సరిహద్దులో బంగారం పట్టివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



