- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వెంట కనిపిస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన ఆర్మీ అధికారి మేజర్ రిషభ్ సింగ్ సాంబ్యాల్ ముందస్తు పదవీ విరమణ చేశారు. 12 ఏళ్ల సైనిక సేవ అనంతరం వ్యక్తిగత, కుటుంబ కారణాలతో ఆర్మీని వీడినట్లు సమాచారం. 2023లో రాష్ట్రపతి ఏడీసీగా ఎంపికైన ఆయనకు సోషల్ మీడియాలో ‘నేషనల్ క్రష్’ అనే ట్యాగ్ కూడా వచ్చింది. రిషభ్ రిటైర్మెంట్పై రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక వివరణ వెలువడలేదు.
- Advertisement -



