‘విద్యుత్ ఆర్టిజన్ల’ పై రౌండ్‌టేబుల్‌లో కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు
ఏప్రిల్ 15న జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు
కక్ష్య సాధింపునకు మూల్యం తప్పదు: సీఐటీయూ జాతీయ కోశాధికారి సాయిబాబు హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం అవుతుందని తెలంగాణ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అధ్యక్షతన కార్మిక సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. సమ్మెకు యావత్ కార్మికవర్గం అండగా నిలవాలనీ, ఫిబ్రవరి 15న అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో సంఘీభావ ప్రదర్శనలు, ధర్నాలు, నిరసనలు తెలియజేయాలని నిర్ణయించాయి. ఈ సందర్భంగా ఆర్టిజన్ కార్మికుల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ”తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో గత 6 రోజులుగా 19 వేల మంది ఆర్టిజన్లు, 1,400 మంది అన్మెన్, పీస్‌రేట్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా పాలకులు ఇచ్చిన హామీలే ఈ సమ్మెలో డిమాండ్లుగా ఉన్నాయి. గతంలో ఇచ్చిన ఆ హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆర్టిజన్లు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెలోకి దిగారు. న్యాయమైన డిమాండ్లను చర్చలు ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించి సమ్మెను నివారించాలి” అని సమావేశం ఏక గ్రీవంగా తీర్మానించింది. అంతకు ముందు ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజ్ మాట్లాడుతూ విద్యార్హత లను బట్టి ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేసి ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపజ ేయాల న్నారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న పీస్ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయకుమార్ యాదవ్ మాట్లాడుతూ సుప్రీంకోర్ట్ తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు శివబాబు మాట్లాడుతూ గృహజ్యోతి పథకం ద్వారా బతుకు భారమైన బిల్ కలెక్టర్లను అదుకోవాలనీ, కార్మికులకు నెలకు 30 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. హెచ్ఎంఎస్ నగర అధ్యక్షులు ఎండి.అంజద్ మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులకు అన్ని కార్మిక సంఘాలు అండగా ఉండాలని కోరారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎల్. పద్మ, టీయూసీఐ నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.ప్రవీణ్, ప్రదీప్, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, ఏఐయూటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. సుధాభాస్కర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అన్ని కార్మిక సంఘాలు బలపర్చాయి.
బెదిరిస్తే మూల్యం తప్పదు సాయిబాబు
సమ్మె చేస్తున్న ఆర్టిజన్ కార్మికులను ఎస్మా, డిస్మిస్, మెమో లాంటి చర్యలతో ప్రభుత్వం బెదిరిస్తోందని సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం.సాయిబాబు విమర్శించారు. సర్కార్ తీరు ఇలాగే కొనసాగితే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ”ఆర్టిజన్ల సమస్య లను పరిష్కరించాలనే కోణంలో సర్కార్ చర్యలు లేవు. సమ్మెను అణచివేసే ప్రయా త్నాలను చేస్తున్నది. సమ్మె చేస్తున్న కార్మికులను భయభ్రాంతులకు గురిచే స్తున్నది. విధుల నుంచి తొలిగిస్తు న్నట్లుగా టర్మినేషన్ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. గతంలో నుండి పొందుతున్న కొన్ని రాయితీ లకు కోతలు పెడుతున్నారు. చలో పాల్వం చకు పిలుపునిస్తే పోలీసులను ప్రయోగించి ఉద్య మాన్ని అణచివేయడానికి ప్రయత్నిం చడం అన్యాయం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మి కులతో చర్చించి వారి సమస్యలను పరిష్కరిం చాలి” అని సాయిబాబు డిమాండ్ చేశారు.
పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



