నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని గ్రామపంచాయతీ పడంపల్లి నందు సర్పంచ్ వాగ్మారే విజయకుమారి సంజు కుమార్, ఉప సర్పంచ్ పౌడే సవిత బసంత్ అధ్యక్షతన గ్రామపంచాయతీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగిందని జిపి కార్యదర్శి గంగాధర్ తెలిపారు . ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ, ఉపసర్పంచ్ మాట్లాడుతూ అంబేద్కర్ గారి ఆశయాలను ఆలోచనా విధానాలను ఆలంబించాలని సమాజం బాగు కోసం పాటుపడాలని సర్పంచ్ , ఉప సర్పంచ్ కోరినారు. అంతకుముందు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలలో గ్రామ సర్పంచ్ , ఉప సర్పంచ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు ,వార్డు సభ్యులు. పంచాయతీ కార్యదర్శి , ఆశా కార్యకర్త భాగ్యశ్రీ. అంగన్వాడి టీచర్ లక్ష్మీ పటేల్, ఫీల్డ్ అసిస్టెంట్ సూర్యకాంత్, గ్రామస్తులు పావుడే బస్వంత్, బిరాదార్ శివరాజ్ , వాగ్మారే మారుతి , విఠల్ , బాలేష్, గ్రామ ప్రజలు అందరూ పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేయడం జరిగింది.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గొప్ప మహానీయుడు : సర్పంచ్ విజయ కుమారి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



