Monday, April 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహా మేధావి: సర్పంచ్ బ్రాండెడ్ వార్ లక్ష్మణ్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహా మేధావి: సర్పంచ్ బ్రాండెడ్ వార్ లక్ష్మణ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన చండేగావ్ గ్రామ సర్పంచ్ బండేడ్ వార్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని జిపి కార్యదర్శి వికాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మణ్, జిపి కార్యదర్శి వికాస్ రెడ్డి మాట్లాడుతూ బాల్యంలో అంబేద్కర్ చాలా అవమానాలు భరించారని అన్నారు. అంచలంచెలుగా ఎదుగుతూ అన్ని భరిస్తూ రాజ్యాంగ పరిషత్ మంత్రివర్గ సభ్యుడిగా చేరారు. వ్యక్తిగత జీవితంలో బౌద్ధ మత స్వీకారం చేశారు. 1912లో బాంబే విశ్వవిద్యాలయంలో బిఏ, 1915 లో కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ, 1921 లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఎంఎస్సీ, ఇవే కాకుండా డీఎస్సీ,  బారిష్టార్, ఎల్ ఎల్ డి, డిలీట్ గౌరవ పట్టణ సాధించారు. గొప్ప మేధావి అని ప్రపంచ దేశాలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్,జిపి కార్యదర్శి , వార్డు సభ్యులు , దళిత సంఘాల నాయకులు, యువకులు,  మహిళలు,  గ్రామ ప్రజలు,  పెద్దలు , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -