Tuesday, April 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే

అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్: జుక్కల్ మండల కేంద్రంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్  జయంతి సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద ఘనంగా నివాళులర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే  అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, ఆయన సేవలను స్మరించుకున్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చేసిన కృషి ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని అంబేద్కర్ కి ఘన నివాళులు అర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -