Tuesday, April 14, 2026
E-PAPER
Homeకరీంనగర్అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ 

అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ 

- Advertisement -

నవతెలంగాణ-రామగిరి 
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎంపీ గడ్డం వంశీ కృష్ణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగ  ఎంపీ గడ్డం వంశీ కృష్ణ మాట్లాడుతూ, అంబేద్కర్  ఆలోచనలు సమాజ నిర్మాణానికి బలమైన పునాది అని పేర్కొన్నారు. ఆయన చేసిన రాజ్యాంగ రూపకల్పన, సమానత్వం కోసం చేసిన పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని, సమాజంలో సమానత్వం, న్యాయం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -