Tuesday, April 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంబేద్కర్ కు నివాళులు 

అంబేద్కర్ కు నివాళులు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135 జయంతి సందర్భంగా మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పలువురు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా  బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దోండి రమణ మాట్లాడుతూసామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛకు ప్రతీకగా నిలిచిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆయనకు నా వినమ్ర నివాళులు. భారత రాజ్యాంగ నిర్మాతగా దేశానికి దిశానిర్దేశం చేసి, అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత నాయకుడు అంబేద్కర్. ఆయన చూపించిన మార్గం మనకు స్ఫూర్తి, ఆయన ఆలోచనలు మనకు మార్గదర్శకం. సమానత్వ సమాజ నిర్మాణం కోసం ఆయన కలలు కన్న భారతదేశాన్ని నిర్మించడం మనందరి బాధ్యత. ఈ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను పాటిస్తూ సమాజానికి సేవ చేయాలని మనం సంకల్పిద్దాం.” ఆయన అన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -