నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలంలోని లొంగన్ జిపి కార్యాలయంలో గ్రామ సర్పంచ్ నాగలగిద్దె ఉషారాణి సదుపటేల్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారని జిపి కార్యదర్శి అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వైసీ నివాళులు అర్పించారు. అనంతరం సమావేశంలో గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల గురించి అంబేద్కర్ చేసిన కృషి యావత్ దేశం మరువలేనిదని అన్నారు. బాల్యం నుండి కఠిన పరిస్థితిలో ఉన్నప్పటికీ ఉన్నత విద్యను అభ్యసించి భారతదేశ మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేయడం గొప్ప విషయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, దళిత నాయకులు, మాజీ సర్పంచులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
లొంగన్ గ్రామంలో డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



