Wednesday, April 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గోవింద్ పల్లిలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

గోవింద్ పల్లిలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
రైతు సోదరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయని జిల్లా కాంగ్రేస్ పార్టీ ఊపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్ అన్నారు. మంగళవారం అయన మండలంలోని గోవింద్ పల్లి గ్రామములో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. రైతులు తమ పంటను మట్టి పెళ్ళాలు లేకుండా చేన్ని పట్టి కేంద్రాలకు తరలించాలని అన్నారు. అలాగే తమ ధాన్యం కొనుగోలు పూర్తి అయిన వెంటనే పట్టా బుక్కు, ఆధార్, బ్యాంకు వివరాలు అందించినట్లయితే ఇబ్బందులు లేకుండా వారం రోజుల్లోనే డబ్బులు తమ తమ ఖాతాల్లో జమ అవుతాయని అన్నారు.

కేంద్రాల్లో హమాలీలా కొరత కాని, గన్ని బ్యాగుల కొరత,లారీల కొరత ఏమాత్రం లేదని అక్కడక్కడా ఒకవేళ ఇబ్బందులు ఎదురైతే గ్రామ సొసైటీ అధికారులు అప్పటికప్పుడే పరిష్కరిస్తారని అన్నారు. గతంలో లాగా సొసైటీ పాలక వర్గం లేనందున, సమస్యలు ఏమైనా ఉంటే గ్రామ సర్పచుల దృష్టికి తీసుకరావాలని కోరారు. వేంటనే సమస్య పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకుంటాని అన్నారు. కార్యక్రమములో మాజీ సొసైటీ చేర్మెన్ చెలిమేల మల్లికార్జున్, జిల్లా నాయకుడు చెలిమేల సర్సయ్య, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు చెలిమేల  శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ జోగినిపల్లి భాగ్య దశగౌడ్, మాజీ ఎంపిటిసి శేఖర్ గౌడ్,మండల కాంగ్రేస్ యూత్ అధ్యక్షుడు రిక్క దినకర్, గ్రామ విడిసి సభ్యులు గ్రామ రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -