Wednesday, April 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంబేద్కర్ సేవలు మార్గదర్శకం: నీల రవీందర్

అంబేద్కర్ సేవలు మార్గదర్శకం: నీల రవీందర్

- Advertisement -

నవతెలంగాణ -ఆత్మకూరు 
హౌజుబుజుర్గు గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని ఎంసీపీఐ (యు) పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా సహాయకార్యదర్శి నీల రవీందర్ మాట్లాడుతూ…”జ్ఞాన స్వరూపి, రాజ్యాంగ శిల్పి అంబేద్కర్ సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం కోసం చేసిన సేవలు యుగయుగాలు మార్గదర్శకం. శిక్షణ పొందండి సంఘటితమవండి, పోరాడండి’ అనే సందేశాన్ని ఆచరించాలి” అన్నారు.

బానిసల పక్షాన నిలబడి సర్వహక్కులు కల్పించిన మహోన్నతుడని, మానవాళికి నాయకుడని, ఆయన జీవిత చరిత్రను ప్రతి మనిషికి తెలియజేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వక్కల కిషన్, దామెరకొండ రమేష్, మంద భద్రయ్య, గుర్రాల మల్లారెడ్డి, ఆకుల శ్రీను, దామరకొండ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -