Wednesday, April 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అణగారిన వర్గాల ఆశాజ్యోతి డా.బాబాసాహెబ్ అంబేద్కర్

అణగారిన వర్గాల ఆశాజ్యోతి డా.బాబాసాహెబ్ అంబేద్కర్

- Advertisement -

నవతెలంగాణ-తుంగతుర్తి
అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడుతూనే, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారం గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. ఈ మేరకు కుల వ్యవస్థ అంటరానితనం వంటి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతూ అందరికీ సమాన హక్కులు గౌరవం దక్కాలని ముఖ్యంగా దళితుల సాధికారత కోసం కృషి చేశారని అన్నారు. పట్టుదల సమానత్వం జ్ఞానార్జన అనే మూడు ముఖ్యమైన సూత్రాలను వారి జీవితం నుండి మనం నేర్చుకోవచ్చని సూచించారు.

అత్యంత పేదరికంలో జన్మించినా,తీవ్ర వివక్షకు గురైనా,అంబేద్కర్ విద్యను ఆయుధంగా చేసుకొని ప్రపంచ మేధావిగా గుర్తింపు సాధించారని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల వారికి సమచిత న్యాయం జరిగిందన్నారు. మహిళలకు చదువుకునే అవకాశంతో పాటు అన్ని రంగాల్లో రాణించే విధంగా రాజ్యాంగాన్ని కల్పించాడని పేర్కొన్నారు. యువత ప్రధానంగా భారత రాజ్యాంగానికి అనుకూలంగా ముందుకు వెళ్లాలన్నారు.విద్యపై ప్రత్యేక దృష్టి సారించి ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలన్నారు. చెడు అలవాటుకు బానిస కాకుండా ప్రయోజకులుగా మారాలని సూచించారు. అంబేద్కర్ స్ఫూర్తితో అందరం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కృషి చేయడమే వారికి మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ జయంతి నిర్వహణ కమిటీ సభ్యులు బల్లెం నవీన్, మరికంటి శ్యాం ప్రసాద్, పాలబిందెల స్వామి, ఇరుగు సుధాకర్, ఇరుగు సురేష్, గుండాల శివ,మాజీ వైస్ ఎంపీపీ దొంగరి శ్రీనివాస్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్, ఉపసర్పంచ్ వెలిశాల సరిత, వార్డు మెంబర్లు సుకన్య, లింగయ్య, లావణ్య, బింగి వెంకటేశ్వర్లు, ఉమ, దొంగరి సోమయ్య, పంచాయతీ కార్యదర్శి దుండి రమేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -