నవతెలంగాణ – దర్పల్లి
మండల కేంద్రములో మంగళవారం అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా జిల్లా కాంగ్రేస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్ పాల్గొని భారత రాజ్యాంగ నిర్మాత డా, బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళలు అర్పించారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ.. సమసమాజ స్వప్నికుడు, బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత ఆశయ సాధనకు కట్టుబడి యువత కొనసాగాలని అన్నారు. కార్యక్రమములో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, చెలిమేల మల్లికార్జున్, చెలిమేల నర్సయ్య, గాదె నరేష్, డా, ఆనంద్, రాకేష్, ఎబినేజర్, దినకర్, రాజు, దినకర్, ప్రశాంత్, చక్రపాణి, దావీదు, పోత రాజు, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



