Wednesday, April 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శాంభవి విద్యార్థులకు రాష్ట్రస్థాయి అవార్డులు

శాంభవి విద్యార్థులకు రాష్ట్రస్థాయి అవార్డులు

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ
ఈ అభ్యాస అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్రస్థాయి వివిధ విభాగాలలో నిర్వహించిన పరీక్షలలో బాల్కొండ మండల కేంద్రంలోని శాంభవి హై స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి అవార్డులు అందుకున్నారు. ఈ అభ్యాస అకాడమీ 12వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాదులోని భారతీయ విద్యా భవన్ ఆడిటోరియంలో నిర్వహించిన ఒలంపియాడ్, ఐఐటి అవార్డు ఫంక్షన్లో ప్రముఖులచే స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు  శాంభవి పాఠశాల చైర్మన్ బొట్ల మధుసూదన్ రాజు, కరస్పాండెంట్ బొట్ల రవీణ్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ మంజుల ను శాలువా మెమొంటాలతో ఘనంగా సత్కరించారు. రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన శాంభవి విద్యార్థులు జే. వర్షిని 9వ తరగతి (ఆర్ఎంఎం) రామన్ మ్యాస్ మహోత్సవం, యు. వెన్నెల 5వ తరగతి టీ ఈఏటీలో ,బి. తన్వి 5వ తరగతి కే ఎస్ఏటీ స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. నూజత్ 9వ తరగతి ఆర్ఎస్ఎం రామన్ సైన్స్ మహోత్సవ్ లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు.జి. రూత్విక్ 8వ తరగతి కే ఎస్ఏటీ లో స్టేట్ 3వ ర్యాంక్,అదేవిధంగా సిహెచ్ వివేక్ సాయి 9వ తరగతి,ఈ. నందిత 5వ తరగతి బివివిఎస్ లో స్టేట్ 3 వ ర్యాంక్ సాధించారని వారు తెలిపారు. రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి, అవార్డులు అందుకున్న విద్యార్థులను ఈ సందర్భంగా శాంభవి పాఠశాల యజమాన్యం అభినందించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -