నవతెలంగాణ – జుక్కల్
మండలాధికారులతో జెడ్పీ సీఈఓ చందర్ నాయక్ మంగళవారం సమావేశం నిర్వహించారు. అనంతరం జుక్కల్ గ్రామ పంచాయతీలో పర్యటించి, ఫామ్ ఫండ్, సీఎస్సి సెంటర్, రీఛార్జ్ ఫిట్ లను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్లు, పీహెచ్ హెచ్ ఎల్ , డ్రైన్ ఎండ్ సోక్ ఫిట్, కమ్యూనిటీ సోక్ ఫిట్, మ్యాజిక్ సోక్ ఫిట్, సిఎస్ సి, జీపి – ఎస్ఎపి, తదితర విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల స్థాయి అధికారులు గ్రామాలలో నిత్యం పర్యటించి అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు, జీపీఓ లు నిత్యం సమయానుకులంగా విధులకు హజరై అందుబాటులొ ఉండి సమస్యలను వీలైనంత వరకు అక్కడే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ క్రాంతీకూమార్, ఎంపిఓ రాము, ఐకేపీ ఏపీఎం వాగ్మారే వందేమాతరం, ఉపాధి హామీ ఎ పీ ఓ తుళసిరామ్ , ఈసీ స్వామీ దాస్ , టీఏ రమేష్, రవిందర్, సిబ్బంది మధు, గంగాధర్ , తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను పరిశీలించిన జడ్పీ సీఈవో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



