Friday, September 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన

నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన

- Advertisement -


నవతెలంగాణ – రాయపోల్ : సెప్టెంబర్‌ 1ని పెన్షన్‌ విద్రోహ దినంగా పాటిస్తూ రాయపోల్‌ మండలం ఎల్కల్‌ ఎంపీపీఎస్‌ పాఠశాలలో ఉపాధ్యాయులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌జీటీయూ రాయపోల్‌ మండల ప్రధాన కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి, ప్రస్తుతం కాలయాపన చేస్తోందని ఆరోపించారు.ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయడంతో పాటు పీఆర్సీని అమలు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఉపాధ్యాయుల ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -