- Advertisement -
- మాజీ మంత్రి జీవన్ రెడ్డి
- నవతెలంగాణ – రాయికల్
- పట్టణంలోని మార్కండేయ ఫంక్షన్ హాల్ లో జీవన్ రెడ్డి వర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాయికల్‌కు వస్తే తనకు సొంత ఇంటికి వచ్చిన భావన కలుగుతుందని, గత 20 నెలలుగా అంతర్గతంగా తమ హక్కుల సాధన కోసం పోరాటం చేశానని, రాయికల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడటంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, “కాంగ్రెస్ పార్టీ దిగజారడానికి కారణం ఎవరు?” అని ప్రశ్నించారు.
- నాలుగు దశాబ్దాలుగా పార్టీలో ఉన్న తనను పక్కన పెట్టిన విధానం బాధాకరమన్నారు. ఉన్న పార్టీ విడిచి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి పోయేవాల్లు ఉంటారని, అలాంటి వారి వల్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ చిన్నాభిన్నం అయ్యిందని, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వార్డు కౌన్సిలర్ల టికెట్ల కేటాయింపులో సైతం కుట్రలు జరిగాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాత్రను గుర్తు చేసిన జీవన్ రెడ్డి,ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుబంధు వంటి పథకాల ద్వారా రైతులకు మేలు జరిగిందన్నారు.
- ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వెనుకబడి ఉందని, ఆడబిడ్డలకు ఇచ్చిన తులం బంగారం మాట ఏమైందని విమర్శించారు. రైతుబంధు, పంట బీమా, సంక్షేమ పథకాల అమలులో లోపాలు ఉన్నాయని ఆరోపించిన ఆయన, గ్రామాభివృద్ధి పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. సర్పంచుల హక్కులు హరించబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై విమర్శలు గుప్పించిన జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరిగా తన రాజకీయ భవిష్యత్తు ప్రజల చేతిలో ఉందని, తమకు అండగా నిలవాలని కార్యకర్తలను కోరారు.
- Advertisement -



