Tuesday, September 1, 2026
E-PAPER
Homeబీజినెస్H12 డ్యూయల్ ఫ్లెక్స్‌రీచ్ వెట్ & డ్రై వాక్యూమ్‌ విడుదల చేసిన డ్రీమ్ టెక్నాలజీ

H12 డ్యూయల్ ఫ్లెక్స్‌రీచ్ వెట్ & డ్రై వాక్యూమ్‌ విడుదల చేసిన డ్రీమ్ టెక్నాలజీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : స్మార్ట్ హోమ్ ఆవిష్కరణలలో ప్రపంచ అగ్రగామి డ్రీమ్ టెక్నాలజీ, శక్తిమంతమైన శుభ్రపరిచే పనితీరు, అనేక పనులు, అధునాతన శుభ్రపరిచే సాంకేతికతలను ఒకచోట చేర్చే బహుముఖ 6-ఇన్-1 డ్రీమ్ H12 డ్యూయల్ ఫ్లెక్స్‌రీచ్ వెట్ & డ్రై వాక్యూమ్‌ను భారతదేశంలో విడుదల చేస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది. రోజువారీ ఇంటి శుభ్రతను సులభతరం చేసేందుకు రూపొందించిన  ఈ కొత్త వెట్ అండ్ డ్రై వాక్యూమ్, సెప్టెంబర్ 01 నుంచి అమెజాన్‌లో రూ. 44,999 ధరకు, అలాగే డ్రీమ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్, క్రోమా మరియు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.

డ్రీమ్ H12 డ్యూయల్ ఫ్లెక్స్‌రీచ్ వెట్ & డ్రై వాక్యూమ్ ప్రధాన ఆకర్షణ దాని బహుముఖ 6-ఇన్-1 శుభ్రపరిచే సామర్థ్యం. ఇది వివిధ ఉపరితలాలపై అనేక రకాల రోజువారీ శుభ్రపరిచే అవసరాలు తీర్చడానికి రూపొందించబడింది. గట్టి నేలలను కడగడం, వాక్యూమ్ చేయడం నుంచి  కార్పెట్లు, సోఫాలు, కర్టెన్లు, కీబోర్డులు, కార్‌ ఇంటీరియర్లు శుభ్రపరచడం వరకు ఈ పరికరం అధిక సౌలభ్యం కోసం శక్తిమంతమైన పనితీరు, మార్చుకోగలిగే అటాచ్‌మెంట్స్‌‌ కలిగి ఉంది. దీని 180° ఫ్లాట్‌గా డిజైన్ తక్కువ ఎత్తు ఉన్న ఫర్నిచర్ కిందకు చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. 23,000Pa సక్షన్, టాంగిల్‌కట్™ రెసిలియంట్ స్క్రాపర్, వేరు చేయగల బ్యాటరీ దీని శుభ్రపరిచే పనితీరు, సౌలభ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి. 90°C హాట్-వాష్ సెల్ఫ్-క్లీనింగ్ సిస్టమ్ నిర్వహణను సులభతరం చేసే H12 డ్యూయల్ ఫ్లెక్స్‌రీచ్ రోజువారీ ఇంటి శుభ్రతకు ఒక చక్కని పరిష్కారంగా నిలుస్తుంది.

డ్రీమ్ టెక్నాలజీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను శర్మ మాట్లాడుతూ, ” రోజువారీ శుభ్రత  పనుల కోసం మరింత తెలివైన, సౌకర్యవంతమైన మార్గాల కోసం భారతీయ కుటుంబాలు ఎక్కువగా చూస్తున్నందున, విభిన్న శుభ్రపరిచే అవసరాలకు అనుగుణంగా మారగల పరిష్కారాలపై అంచనాలు పెరుగుతున్నాయి. డ్రీమ్ H12 డ్యూయల్ ఫ్లెక్స్‌రీచ్ తక్షణ, లక్షిత శుభ్రపరిచే అవసరాల కోసం వినియోగదారులకు ఎక్కువ సౌలభ్యం, నియంత్రణను అందించడంపై మా దృష్టి ఉంది. ఇది వినియోగదారులు శ్రమ తగ్గిస్తూ  వివిధ ప్రాంతాలు, ఉపరితలాలపై రోజువారీ మురికిని మరింత సులభంగా తొలగించేలా చేస్తుంది.” ఆధునిక భారతీయ కుటుంబాల విభిన్న దినచర్యలకు అనుగుణమైన  ఆచరణాత్మక, తెలివైన గృహ శుభ్రపరిచే పరిష్కారాలను అభివృద్ధి చేయాలనే డ్రీమ్ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది” అన్నారు.

ప్రధాన ఫీచర్లు:

·        6-ఇన్-1 బహుముఖ శుభ్రత: డ్రీమ్ H12 డ్యూయల్ ఫ్లెక్స్‌రీచ్ తడి, పొడి వాక్యూమింగ్‌ను అనేక స్విచ్చబుల్ అటాచ్‌మెంట్‌లతో మిళితం చేస్తుంది.  ఇంటిలోని వివిధ ప్రాంతాలకు బహుముఖ శుభ్రపరిచే పరిష్కారాన్ని అందిస్తుంది. ఫ్లోర్‌ కడగడం, వాక్యూమ్ చేయడం నుంచి  కార్పెట్‌లు, సోఫాలు, కర్టెన్లు, కీబోర్డులు, కార్ ఇంటీరియర్‌లను శుభ్రపరచడం వరకు ఈ పరికరం విస్తృత శ్రేణి రోజువారీ శుభ్రపరిచే అవసరాలు తీర్చేలా రూపొందించబడింది.

·       23,000Pa శక్తిమంతమైన సక్షన్: 23,000Pa సక్షన్‌తో పనిచేసే H12 డ్యూయల్ ఫ్లెక్స్‌రీచ్, తడి, పొడి మరకలు రెండింటినీ సులభంగా తొలగించడానికి రూపొందించబడింది. ఇది రోజువారీ దుమ్ము, చెత్త సేకరించగలదు. ఆహార కణాలు, కాఫీ గింజలు, ఒలికినవి, వంటగది జిడ్డు వంటి కఠిన మరకలు కూడా తొలగించగలదు.  వివిధ ఉపరితలాలపై మరింత మెరుగైన శుభ్రతను అందించడంలో సహాయపడుతుంది.

·       180° వరకు ఒదిగి శుభ్రపరచడం: ఈ పరికరం 180° వరకు వంగగలదు.  మంచాలు, సోఫాలు, ఇతర తక్కువ ఎత్తు ఫర్నిచర్ కిందకు సులభంగా చేరుకోగలదు. వాక్యూమ్ బాడీ 14cm లోతు ఉన్న ప్రదేశాలకు, బ్రష్ హెడ్ 9.6cm లోతుకు చేరుకోగలగడంతో వినియోగదారులు బరువైన ఫర్నిచర్‌ను కదపాల్సిన అవసరం లేకుండా, చేరుకోవడం కష్టంగా ఉండే ప్రదేశాలను శుభ్రం చేయవచ్చు.

·       టాంగిల్‌కట్™ రెసిలియంట్ స్క్రాపర్: వినూత్నమైన టాంగిల్‌కట్™ రెసిలియంట్ స్క్రాపర్  శుభ్రపరిచేటప్పుడు జుట్టు చిక్కులు తగ్గించడానికి రూపొందించబడింది.  దీనివల్ల చేతితో బ్రష్‌ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ సిస్టమ్ మంచినీటితో శుభ్రపరిచే మెకానిజంతో కలిసి పనిచేస్తూ, శుభ్రం చేస్తున్నప్పుడు బ్రష్‌ను నిరంతరం కడుగుతుంది.  మరింత సౌకర్యవంతమైన, అవాంతరాలు లేని అనుభూతి అందించడంలో సాయపడుతుంది.

·       ఎక్కువ పని సమయం, విడదీయగల బ్యాటరీ: ఎంచుకున్న క్లీనింగ్ మోడ్‌ బట్టి, H12 డ్యూయల్ ఫ్లెక్స్‌రీచ్ ఫ్లోర్-వాషింగ్ మోడ్‌లో 50 నిమిషాల వరకు, వాక్యూమ్ మోడ్‌లో 60 నిమిషాల వరకు పనిచేస్తుంది. దీని విడదీయగల బ్యాటరీ ప్యాక్ అదనపు సౌలభ్యాన్ని అందిస్తూ వినియోగదారులు ఎక్కువ సేపు శుభ్రం చేయడానికి, పెద్ద ప్రదేశాల కోసం అదనపు బ్యాటరీని మార్చుకోవచ్చు.

·       90°C హాట్-వాష్ సెల్ఫ్-క్లీనింగ్: H12 డ్యూయల్ ఫ్లెక్స్‌రీచ్‌లో 90°C హాట్-వాష్ సెల్ఫ్-క్లీనింగ్ సిస్టమ్ ఉంది.  ఇది బ్రష్ నుంచి  గ్రీజు కరిగించి, మొండి అవశేషాలు తొలగించడంలో సాయపడుతుంది. దీని తర్వాత అధిక-ఉష్ణోగ్రత వేడి-గాలి డ్రైయింగ్ ఉంటుంది. చేతితో శుభ్రం చేయవలసిన అవసరాన్ని తగ్గిస్తూ, బ్రష్‌ను పొడిగా, తాజాగా ఉంచడంలో సాహాయపడటానికి ప్రత్యేకమైన డ్రైయింగ్ మోడ్‌లు కలిగి ఉంది.

·       ఎయిర్‌గార్డ్™ మల్టీ-కోన్ టెక్నాలజీ: ఎయిర్‌గార్డ్™ మల్టీ-కోన్ టెక్నాలజీలో ≥0.3μm పరిమాణంలో ఉన్న 99.95% కణాలు పట్టుకునేలా రూపొందించినన బహుళ-దశల వడపోత వ్యవస్థ ఉంది. దీనిలోని ప్రెసిషన్ ఫిల్ట్రేషన్, ప్రీ-ఫిల్ట్రేషన్, మల్టీ-కోన్ సైక్లోన్ టెక్నాలజీల కలయిక, స్థిరమైన సక్షన్ పనితీరుకు తోడ్పాటు ఇస్తూ సన్నని ధూళి, చెత్త వేరు చేయడంలో సాయపడుతుంది.

·       పవర్‌అలైన్™ గ్రిప్: వినియోగదారుడి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పవర్‌అలైన్™ గ్రిప్, గురుత్వాకర్షణ కేంద్రాన్ని వినియోగదారుడి చేతికి దగ్గరగా తీసుకువచ్చేలా మోటార్, బ్యాటరీని అమరుస్తుంది. ఈ సౌకర్యవంతమైన డిజైన్ మణికట్టుపై ఒత్తిడి తగ్గిస్తూ నియంత్రణ, సులభమైన కదలికను మెరుగుపరచడంలో సాయపడుతూ ఎక్కువ సేపు శుభ్రపరిచేటప్పుడు దీనిని ఉపయోగించడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

·       ఇల్యూమినేషన్ మల్టీ-సర్ఫేస్ బ్రష్: అప్‌గ్రేడ్ చేసిన ఈ మల్టీ-సర్ఫేస్ బ్రష్‌లో తెల్లని LED లైటింగ్ ఉంటుంది. ఇది కఠినమైన ఫ్లోర్స్‌పై ఉండే సన్నని దుమ్ము, చెత్తను గుర్తించడంలో సాయపడుతుంది కాబట్టి  అదనంగా శుభ్రం చేయాల్సిన ప్రదేశాలను సులభంగా గుర్తించవచ్చు. దీని యాంటీ-ట్యాంగిల్ డిజైన్ కఠినమైన ఫ్లోర్స్‌,  కార్పెట్‌లు రెండింటిపైనా సున్నితమైన శుభ్రత అందిస్తుంది.  రోజువారీ ఉపయోగం కోసం మరింత బహుముఖంగా పనిచేస్తుంది.

డ్రీమ్ H12 డ్యూయల్ ఫ్లెక్స్‌రీచ్‌కు 1-సంవత్సరం వారెంటీ,  భారతదేశంలోని 160కి పైగా నగరాల్లో విస్తరించి ఉన్న డ్రీమ్ దేశవ్యాప్త అమ్మకాల తర్వాత సేవా నెట్‌వర్క్ తోడ్పాటు ఉంది. అర్హత గల ప్రదేశాలలో వినియోగదారులు పికప్, డ్రాప్ సాయం, ఇన్‌స్టాలేషన్ తోడ్పాటు సహా ప్రత్యేక సహాయ సేవలు కూడా పొందవచ్చు.

H12 డ్యూయల్ ఫ్లెక్స్‌రీచ్ విడుదలతో భారతదేశంలో డ్రీమ్ తన స్మార్ట్ హోమ్ పోర్ట్‌ఫోలియో విస్తరిస్తూనే ఉంది. ఇది బహుముఖ శుభ్రపరిచే సామర్థ్యాలు, సహజమైన డిజైన్‌ను ఒకచోట చేర్చి రోజువారీ ఇంటి సంరక్షణను సులభతరం చేస్తుంది, ఆధునిక గృహాల్లో శుభ్రపరిచే పనిని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -