Tuesday, September 1, 2026
E-PAPER
Homeఆదిలాబాద్శోకసంద్రంగా పార్డీ(బీ) గ్రామం.. ఒకేరోజు నలుగురి అంత్యక్రియలు

శోకసంద్రంగా పార్డీ(బీ) గ్రామం.. ఒకేరోజు నలుగురి అంత్యక్రియలు

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని ఫార్డి (బి ) గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. తాజాగా ఆ నలుగురిని ఒకే రోజు దహన సంస్కారాలకు తీసుకెళ్ళిన ఘటన గ్రామస్తులను తీరని వేదనకు గురిచేసింది. దారిపొడువునా మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు విలపించారు. ఒకదాని వెంట మరొటి వరుసగా నాలుగు మృతదేహాలు స్మశాన వాటికకు వెళుతున్న దృశ్యాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేసింది. బాధాతప్త హృదయాలతో స్మశాన వాటిక ప్రయాణం అతి భారంగా సాగింది. మరోవైపు అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏడుగురు ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.

సోమవారం సాయంత్రం మహారాష్ట్ర తోటంబ-తోటంబ గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో జీపు బోల్తా పడడంతో ఒకే గ్రామానికి చెందిన నలుగురు మృతిచెందారు. మృతులు నిర్మల్‌ జిల్లా కుభీర్‌ మండలంలోని పార్డీ (బీ) గ్రామస్తులు. మృతులు: తూము సాయిలు, తూము గౌరబాయి, ఆవుల గంగాధర్, ఏ.తులసిరామ్.

ముగ్గురు ఒకే వరుసకు చెందినవారు..
గ్రామమలో తూము గౌరబాయి, ఆవుల గంగాధర్, తూము సాయిలు, ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. అంత్యక్రియలకు హాజరైన బంధువులకు ఈ ముగ్గురు ఏదో ఒక బంధుత్వం కలిగున్నవారే.. ఈ ప్రమాదంతో తూము సాయిలు భార్య ముత్తుబాయి, ఆవుల గంగాధర్ భార్య ప్రేమల, తమ భర్తలను కోల్పోయారు. వీరికి కూడా ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -