– కమీషనర్ దిలీప్ రెడ్డి
నవతెలంగాణ – అశ్వారావుపేట
మున్సిపాలిటీ పరిధిలోని మాంసం దుకాణాల నుంచి సేకరించిన కోడి, మేక, చేపల వ్యర్థాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు కమిషనర్ తుడి దిలీప్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు సెప్టెంబర్ 3న ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో వేలం నిర్వహించనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేలంలో పాల్గొనదలచిన ఆసక్తి గల వ్యక్తులు, వ్యాపారులు సెప్టెంబర్ 2 న బుధవారం సాయంత్రం 5 గంటల్లోపు మున్సిపల్ కార్యాలయంలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. గడువు అనంతరం నమోదు చేసుకునే అవకాశం ఉండదన్నారు. వేలానికి సంబంధించిన నిబంధనలు, షరతులు కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
పట్టణంలో మాంసం వ్యర్థాలను సక్రమంగా తొలగించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా వేలం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. నిబంధనలకు అనుగుణంగా వేలం నిర్వహించేందుకు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.



