Wednesday, April 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాజ్ పూర్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

తాజ్ పూర్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

- Advertisement -

ముఖ్యఅతిథిగా హాజరైన రూరల్ సీఐ 
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ 

డా, బి. ఆర్ అంబేద్కర్ జయంతి ని పురస్కరించుకొని  మండలంలోని  తాజ్ పూర్ లో గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ పాలకవర్గం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా స్థానిక సీఐ  చంద్రబాబు, రూరల్ ఎస్హెచ్ఓ  అనీల్ కుమార్ లు హాజరై,, మాట్లాడారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ  సందర్బంగా గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్  మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం, దళిత పీడిత బహుజన వర్గాల స్వేచ్ఛ కోసం వారు రచించిన రాజ్యాంగం ఎంతో గొప్పదని కొనియాడారు. ఈ కార్యక్రమం లో సామాజిక వేత్త డా, ర్యాకల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి బి, నరేందర్, ఉపసర్పంచ్ వరిగంటి కృష్ణ, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, మహ్మద్ గాలిబీ యాకుబ్, బొమ్మారపు రామక్రిష్ణ, బొమ్మారపు లక్ష్మి బాల్ రాజ్, బీట్కూరి మహేష్, వరిగంటి మానస నాగరాజు, షేక్ అహ్మద్,  మాజీ సర్పంచ్ లు,అన్ని కుల సంఘాల నాయకులు, యువకులు, మహిళలు హాజరయ్యారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -