Tuesday, September 1, 2026
E-PAPER
Homeబీజినెస్రాజమండ్రిలో కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్‌ను ప్రారంభించిన అక్కినేని నాగార్జున

రాజమండ్రిలో కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్‌ను ప్రారంభించిన అక్కినేని నాగార్జున

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే, ప్రముఖ ఆభరణాల కంపెనీలలో ఒకటిగా వెలుగొందుతున్న కళ్యాణ్ జ్యువెలర్స్, ఈ రోజు రాజమండ్రిలోని మల్లినా నగర్‌లో తమ సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ ప్రాంతంలో బ్రాండ్ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ షోరూమ్‌ను నటుడు అక్కినేని నాగార్జున గారు ప్రారంభించారు. ఈ షోరూమ్‌లో కళ్యాణ్ జ్యువెలర్స్ వారి ముహూరత్ (పెళ్లి ఆభరణాల శ్రేణి), ముద్ర (చేతితో తయారు చేసిన యాంటిక్ ఆభరణాలు), నిమః (టెంపుల్ జ్యువెలరీ) వంటి ప్రముఖ హౌస్ బ్రాండ్‌లతో పాటు మరెన్నో అద్భుతమైన డిజైన్లు అందుబాటులో ఉన్నాయి.

విలాసవంతమైన వాతావరణంతో పాటు కల్యాణ్‌ జువెల్లర్స్‌ అందించే ప్రత్యేక ఆభరణాల శ్రేణుల్లోని విస్తృత డిజైన్లను ఈ కొత్త షోరూమ్‌లో అందుబాటులో ఉంచారు. ఈ ప్రాంతంలోని వినియోగదారులకు అత్యుత్తమ షాపింగ్‌ అనుభూతిని అందించేలా షోరూమ్‌ను తీర్చిదిద్దారు.

షో రూమ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, “కళ్యాణ్ జ్యువెలర్స్ వారి కొత్త షోరూమ్ ప్రారంభోత్సవంలో భాగం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నమ్మకం , పారదర్శకత మరియు వినియోగదారులకు తొలి ప్రాధాన్యం వంటి విలువలను నిరంతరం ముందుకు తీసుకెళ్తున్న సంస్థకు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. రాజమండ్రిలోని వినియోగదారులు, బ్రాండ్ యొక్క అసాధారణమైన సేవా ప్రమాణాలను, విభిన్న శ్రేణిలోని సున్నితమైన ఆభరణాల కలెక్షన్లను అభినందిస్తూ, కళ్యాణ్ జ్యువెలర్స్‌ పట్ల తమ అభిమానం, మద్దతును అందిస్తారని నేను నమ్ముతున్నాను” అని అన్నారు.  

ఈ ప్రారంభోత్సవంపై కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్‌లో మా కొత్త షోరూమ్ ను వైభవంగా ప్రారంభించటం ద్వారా మా వినియోగదారుల మారుతున్న అవసరాలను నిజంగా తీర్చే ఒక సమగ్ర షాపింగ్ గమ్యస్థానాన్ని సృష్టించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. కళ్యాణ్ జ్యువెలర్స్ యొక్క శాశ్వతమైన విశ్వాసం, పారదర్శక విలువలకు కట్టుబడి ఉంటూనే ప్రపంచ స్థాయి సౌకర్యాలు,  సేవల ద్వారా ఉన్నతమైన అనుభవాన్ని అందించడానికే మేము కట్టుబడి ఉన్నాము” అని అన్నారు. 

 ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, కళ్యాణ్ జ్యువెలర్స్ ‘వాల్యూ యాడిషన్’పై 30% తగ్గింపుతో ప్రత్యేక ఇన్-స్టోర్ ఆఫర్లను ప్రకటించింది. * మార్కెట్‌లోనే అత్యంత తక్కువగా, అన్ని షోరూమ్‌లలో ఒకే విధంగా ఉండే బ్రాండ్ యొక్క స్పెషల్ గోల్డ్ బోర్డ్ రేటు కూడా పరిమిత కాలం పాటు వర్తిస్తుంది.

కళ్యాణ్ జ్యువెలర్స్‌లో విక్రయించే ఆభరణాలన్నీ బిఐఎస్-హాల్‌మార్క్‌ కలిగి ఉంటాయి. ఇవి పలు స్వచ్ఛతా పరీక్షలను ఎదుర్కొంటాయి. దీనికి తోడు , వినియోగదారులు కళ్యాణ్ జ్యువెలర్స్ యొక్క 4-అంచెల హామీ పత్రాన్ని కూడా అందుకుంటారు. ఇది బంగారం స్వచ్ఛతకు హామీ ఇవ్వడంతో పాటు, జీవితకాలం ఉచిత నిర్వహణ, ఉత్పత్తికి సంబంధించిన పూర్తి సమాచారం, పారదర్శకమైన మార్పిడి , బై బ్యాక్ విధానాలను అందిస్తుంది. తద్వారా విశ్వాసం , పారదర్శకత పట్ల బ్రాండ్ యొక్క నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తుంది.

ఈ షోరూమ్‌లో కళ్యాణ్ యొక్క ప్రసిద్ధ అంతర్గత బ్రాండ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. వాటిలో ముహూరత్ (పెళ్లి నగలు), ముద్ర (చేతితో తయారు చేసిన యాంటిక్ ఆభరణాలు), నిమహ్ (టెంపుల్ జ్యువెలరీ), గ్లో (డ్యాన్సింగ్ డైమండ్స్ ), జియా (సోలిటైర్ తరహా వజ్రాభరణాలు), అనోఖి (అన్కట్ డైమండ్స్), అపూర్వ (ప్రత్యేక సందర్భాల కోసం వజ్రాలు), అంతర (పెళ్లి వజ్రాలు), హీరా (రోజువారీ ధరించే వజ్రాలు), రంగ్ (విలువైన రాళ్ల ఆభరణాలు) మరియు ఇటీవల ప్రారంభించిన లీల (రంగు రాళ్లు మరియు వజ్రాల ఆభరణాలు) ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -