- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. మంగళవారం ఉదయం కీవ్ సహా పలు ప్రాంతాలపై జరిగిన దాడుల్లో 12 మంది చనిపోగా.. మృతుల్లో ఒక భారతీయుడు ఉన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. మరో 18 మందికి పైగా గాయపడ్డారన్నారు. ఈ దాడుల్లో నివాస భవనాలు, రైల్వే సదుపాయాలు ధ్వంసమయ్యాయి, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కీవ్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
- Advertisement -



